సినీ థియేటర్స్ ఓపెన్ చేస్తే ‘సీన్’ మారుతుంది!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. థియేటర్స్ సర్వం బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ 3.0లో చాలా సడలింపులు ఉన్నప్పటికీ థియేటర్స్ మాత్రం అందులో లేవ్. దీంతో థియేటర్స్‌కు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తారా అని సదరు యాజమాన్యం.. మరోవైపు దర్శకనిర్మాతలు.. ఇంకోవైపు సినీ ప్రియులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. అయితే.. ఒక వేళ సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చంటే పరిస్థితి ఎలా ఉంటుంది..? మునుపటి మాదిరిగానే జనాలు థియేటర్స్‌కు క్యూ కడతారా లేదా..? కరోనా భయం వీడి జనాల్ని థియేటర్స్ వైపు ఎలా నడిపించాలి..? థియేటర్స్ ఓపెన్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనే విషయాలపై ఇటీవలే హైదరాబాద్‌లోని థియేటర్స్ యజమానులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలను కలిసి చర్చించిన విషయాలతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు తెలియవచ్చింది.
మార్పులు ఇలా ఉంటాయ్..
* ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బస్సులు నడుస్తున్నాయ్. సీటు మార్చి సీటులో మాత్రమే ప్రయాణికులు పయనిస్తున్నారు. అదే విధానాన్ని సినిమా థియేటర్లలో కూడా అమలు కానుంది. అంటే ఒకటో సీటు బుక్ చేసుకుంటే రెండు ఖాళీ.. మూడు మాత్రమే బుక్ చేసుకోవచ్చన్న మాట.
* రోజుకు నాలుగు ఆటలు బదులు కరోనా తర్వాత మూడు ఆటలే నడవనున్నాయ్. ఎందుకంటే షోకు.. షోకు మధ్యలోని గ్యాప్‌లోని సీట్లన్నీ శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కనీసం 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుంది గునక మూడు ఆటలకు శానిటైజ్ చేసేకి చాలానే సమయం పడుతుంది.
* టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే.. ఇక కాగితం రూపంలో ఉండవ్. ఈ విధానాన్ని ఎత్తేయాలని థియేటర్స్ యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలియవచ్చింది.
*మరీ ముఖ్యంగా.. థియేటర్స్‌లోకి ఎంట్రీ మొదలుకుని ఇంటర్వెల్‌లో తినుబండారాలు కొనుక్కోవడానికి.. బాత్రూమ్ వెళ్లినప్పుడు.. షో అయిపోయి బయటికెళ్లేటప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు కచ్చితంగా చేసుకోవాల్సిందే. లేకుంటే పరిస్థితులు మారిపోతాయి.
*ప్రభుత్వ పెద్దలను కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న థియేటర్స్ యజమానులను ఆదుకోవాలని కోరతామని సుదర్శన్ థియేటర్ యజమాని బాలగోవింద్ రాజ్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. అదే విధంగా థియేటర్స్ యాజమాన్యం అనుకున్న నిర్ణయాలను వారి ముందుంచి.. ప్రభుత్వం సూచించే అన్ని నియమ నిబంధనలనూ అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది థియేటర్స్ యాజమాన్యం.
మంచి రోజులెప్పుడో..!?
మొత్తానికి చూస్తే సినిమా చూడాలంటే ఇదివరకటిలా పరిస్థితులుండవ్.. సీన్ మొత్తం మారిపోతుందన్న మాట. అంటే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన థియేటర్స్ యజమానులకు మళ్లీ గట్టిగానే దెబ్బ పడనుందన్న మాట. సీటింగ్ గ్యాప్‌తో కొంతలో కొంత అయినా యాజమాన్యాలు నష్టం తగ్గించుకోవచ్చు. మరి ఎప్పుడు పరిస్థితులు అనుకూలిస్తాయో..? థియేటర్స్‌కు జనాలు ఏ మాత్రం తరలివస్తారో..? మళ్లీ సినీ నటీనటులు, థియేటర్స్‌కు ఎప్పుడు మంచి రోజులొస్తాయో జస్ట్ వెయిట్ అండ్ సీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments