కరోనా ఎఫెక్ట్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

  • IndiaGlitz, [Sunday,March 15 2020]

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు కారణం కరోనా విస్తరిస్తుండటమేనని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 6వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాదు.. వీటితో పాటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వాయిదా వేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నామన్నారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ రద్దు కాదు కానీ ఎన్నికల కోడ్‌ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ, నామినేషన్లు ఏవీ రద్దు కావని.. ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విజేతలేనని, వారు కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.

ఇబ్బంది రాదనుకున్నాం కానీ..

ఎలక్షన్ సమయాల్లో ప్రచారం, పోలింగ్ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సమూహంలా చేరే అవకాశాలు ఉన్నందున.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ప్రభావం ఉందని ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. వాస్తవానికి కరోనాతో ఎన్నికలకు ఇబ్బంది రాదని ముందు భావించామని కానీ.. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిందని అందుకే తాము కూడా ఎన్నికలను వాయిదా వేస్తున్నామని తెలిపారు. అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిపి, పరిస్థితులను మదింపు చేసి, ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని రమేష్ కుమార్ వెల్లడించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

హింసాత్మక ఘటనలపై..

‘గుంటూరు, చిత్తూరులో అత్యంత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫారసు చేస్తున్నాం. ఎన్నికల విధులు చేపట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాచర్లలో దాడులకు పాల్పడినవారిపై బెయిలబుల్‌ సెక్షన్లు సరికాదు. మాచర్ల సీఐపై సస్పెన్షన్‌ వేటు వేస్తాం. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలపై బదిలీ వేటు ఉంటుంది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణ చేస్తున్నాం. ఆ మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోము. మహిళలు, బలహీనవర్గాలపై దాడులు అత్యంత శోచనీయం. స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు తీవ్రంగా పరిగణిస్తున్నాం

More News

కరోనా ఎఫెక్ట్ : కేసీఆర్ ప్రకటనాంతరం చిరు కీలక నిర్ణయం

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా'... రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో

చిరు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. పిచ్చ కామెడీ..!

‘అల వైకుంఠపురములో..’ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రేంజ్ మారిపోయింది.

స్ప్రైట్‌లో పురుగులు.. కంగుతిన్న జనం

శీతల పానీయాల్లో ఈ మధ్య ఎక్కడ చూసినా పురుగులు ప్రత్యక్షమవుతున్నాయ్. సదరు కూల్ డ్రింక్స్ తయారు చేసే ముందు..

రేవంత్‌ను కాంగ్రెస్‌ నుంచి తరిమేయాలనుకుంటున్నారా..!?

తెలంగాణ కీలకనేత, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి తరిమేయడానికి పక్కా ప్లాన్‌తో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారా..?