కరోనా ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు స్టేషన్‌లోనే మంగళ స్నానం..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి సెలవులు కూడా దొరకడం లేదు. పెళ్లైనా.. పేరంటమైనా కూడా ఏదో ఒకటి అర సెలవులతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు, వైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి సెలవులు ఇవ్వడం వారి పై అధికారులకు కష్టతరంగా మారింది. కాగా.. ఒక మహిళా కానిస్టేబుల్‌కు వివాహం ఖాయమైంది. మరి అధికారులకు సెలవులు ఇవ్వడం కష్టంగా మారింది.
ఈ క్రమంలో సదరు మహిళా కానిస్టేబుల్‌కు తోటి మహిళా కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మంగళ స్నానం చేయించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆశ అనే యువతి మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 30న ఆమె వివాహం జరగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మినీలాక్ డౌన్‌లు అమలవుతున్న సందర్భంగా పోలీసులకు సెలవులు దొరకడం కష్టమైపోయింది.
ఈ నేపధ్యంలో ఆశకు మంగళస్నానాల తంతు రోజున సెలవు దొరకలేదు. దీంతో ఆమెకు తోటి మహిళా కానిస్టేబుళ్లు స్టేషన్ ఆవరణలోనే మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా ఆశ మాట్లాడుతూ.. తనకు గత ఏడాదే వివాహం జరగాల్సిందని, అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిందన్నారు. ఇప్పుడు ఏప్రిల్ 30న వివాహం జరగనున్నదన్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వివాహానికి తగినన్ని రోజుల పాటు సెలవులు దొరకలేదని తెలిపారు. దీంతో డ్యూటీలో ఉంటూనే మంగళ స్నానం తంతు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout