కరోనా నేపథ్యంలో ఐటీ శాఖ కీలక నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కాటేస్తున్న తరుణంలో.. ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయాలని కీలక ప్రకటన చేసింది. దీంతో సుమారు 14 లక్షల మందికి దీని వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అన్ని జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయనున్నట్టు ఓ ప్రకటన రూపంలో ఐటీ తెలిపింది.
అందుకే ఈ నిర్ణయం..
‘తాము తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు లక్ష సంస్థలకు, అందులోనూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరనుంది. రూ.18,000 కోట్లను వెంటనే రీఫండ్ చేస్తాం. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొంది. పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.. అందుకే ఈ పనిచేస్తున్నాం’ అని ఐటీ శాఖ ప్రకటించింది. మొత్తానికి చూస్తే.. ఐటీ శాఖ బుధవారం నాడు తియ్యటి శుభవార్త చెప్పిందనే అనుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout