కరోనా నేపథ్యంలో ఐటీ శాఖ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కాటేస్తున్న తరుణంలో.. ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయాలని కీలక ప్రకటన చేసింది. దీంతో సుమారు 14 లక్షల మందికి దీని వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అన్ని జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయనున్నట్టు ఓ ప్రకటన రూపంలో ఐటీ తెలిపింది.

అందుకే ఈ నిర్ణయం..

‘తాము తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు లక్ష సంస్థలకు, అందులోనూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరనుంది. రూ.18,000 కోట్లను వెంటనే రీఫండ్ చేస్తాం. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొంది. పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.. అందుకే ఈ పనిచేస్తున్నాం’ అని ఐటీ శాఖ ప్రకటించింది. మొత్తానికి చూస్తే.. ఐటీ శాఖ బుధవారం నాడు తియ్యటి శుభవార్త చెప్పిందనే అనుకోవచ్చు.

More News

డిశ్చార్జ్ అయిన కనికాకు కొత్త చిక్కులు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అని రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో అస్సలు తిరగకండి!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో.

లాక్‌డౌన్ పొడిగింపు పక్కా.. IRCTC సంకేతాలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి మార్చి 24 నుంచి ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం విదితమే.

ఒక్కరోజే ఇండియాలో 32 మంది మృతి.. 773 కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో కూడా దీనిప్రభావం గట్టిగానే పడింది. రోజురోజుకు కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.