కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ టికెట్లు నో సేల్..!

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా ప్రభావం ఐపీఎల్- 2020 సీజన్‌పై కూడా పడింది. దీంతో మ్యాచ్‌ల్ని ఇక్కడ నిర్వహిచొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పలు రాష్ట్ర హైకోర్టుల్లో పిల్‌లు దాఖలయ్యాయి. మార్చి 29 నుంచి మే 24 వరకూ భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పూర్తి షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ల్ని వీక్షించేందుకు స్టేడియానికి వేలాది మంది ప్రేక్షకులు వస్తే పరిస్థితేంటి..? కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది..? కదా అని పిటీషనర్లు కోర్టులను కోరారు.

ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పలువురు మంత్రులు భేటీ అయ్యి.. ఐపీఎల్ గురించి నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా.. ఐపీఎల్ టికెట్ల అమ్మకాన్ని నిషేధించాలని నిర్ణయించారు మంత్రులు. ఇలా చేయడం వల్ల గుంపులు గుంపులుగా జనాలు రారని.. తద్వారా కరోనా ముప్పు తగ్గే అవకాశం ఉందని ఆ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై క్రీడాభిమానులు, క్రికెటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను అధిష్టానం నియమించింది. బుధవారం సాయంత్రం అధికారికంగా కేంద్ర అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది.

'నన్నేలు నా స్వామి' మహాగ్రంధాన్ని ఆవిష్కరించిన అమిత్ షా

ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ' ఆరాధన' పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మరొక సారి పవిత్ర సంచలనానికి తెర లేపారు.

సింధియా ఎఫెక్ట్.. డీకేకు కర్ణాటక పగ్గాలు!

కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్ షూటర్, పార్టీకి విధేయుడిగా.. కట్టప్పలా కాంగ్రెస్‌కు కాపలా ఉంటున్న డీకే శివకుమార్‌కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.

జగన్ షాకింగ్ నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ నేతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి ఇప్పటి వరకూ పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్న

బోండా ఉమ, బుద్ధాపై దాడి.. కార్లు ధ్వంసం.. అసలేమైంది!?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ వర్గీయులు దాడికి దిగారు.