కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ టికెట్లు నో సేల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా ప్రభావం ఐపీఎల్- 2020 సీజన్‌పై కూడా పడింది. దీంతో మ్యాచ్‌ల్ని ఇక్కడ నిర్వహిచొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పలు రాష్ట్ర హైకోర్టుల్లో పిల్లు దాఖలయ్యాయి. మార్చి 29 నుంచి మే 24 వరకూ భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పూర్తి షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ల్ని వీక్షించేందుకు స్టేడియానికి వేలాది మంది ప్రేక్షకులు వస్తే పరిస్థితేంటి..? కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది..? కదా అని పిటీషనర్లు కోర్టులను కోరారు.
ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పలువురు మంత్రులు భేటీ అయ్యి.. ఐపీఎల్ గురించి నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా.. ఐపీఎల్ టికెట్ల అమ్మకాన్ని నిషేధించాలని నిర్ణయించారు మంత్రులు. ఇలా చేయడం వల్ల గుంపులు గుంపులుగా జనాలు రారని.. తద్వారా కరోనా ముప్పు తగ్గే అవకాశం ఉందని ఆ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై క్రీడాభిమానులు, క్రికెటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout