బన్నీ సినిమాకు కరోనా ఎఫెక్ట్... లొకేషన్ చేంజ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన బన్నీ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. మార్చి 16 నుండి కేరళ అడవుల్లో షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ.. కరోనా ఎఫెక్ట్ ఈ సినిమాపై పడింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేరళ ప్రభుత్వం అక్కడి ఆలయాలను, థియేటర్స్‌ను కూడా కొన్ని రోజుల పాటు మూసి వేసేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సమస్య బన్నీ, సుకుమార్ సినిమాకు కూడా ఇబ్బందిగా మారింది. దీంతో షూటింగ్‌ను ఆంధ్ర ప్రాంతంలోని మారేడు మిల్లికి మార్చారట. ఈ నెల 20 నుండి సినిమా షూటింగ్ అక్కడే జరగనుందట. కొన్నిసీన్స్‌కు కేరళ అడవులే కావాలని అనుకుంటే.. ఆ సీన్స్‌ను వాయిదా వేసి కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత చిత్రీకరిస్తారట.
ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com