కరోనా దెబ్బకు ‘అవతార్ 2’ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ సినిమా రంగంపై కరోనా వైరస్ చాలా పెద్ద ఎఫెక్ట్‌ను చూపించింది. థియేటర్స్ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్‌ను కొందరు ధైర్యం చేసి స్టార్ట్ చేసినప్పటికీ కరోనా ఉధృతంగా ఉండటంతో షూటింగ్స్ అన్నీ వాయిదాలు పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ సీక్వెల్‌గా ‘అవతార్ 2’ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2021లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కామెరూన్ ప్రటించారు కూడా. కొన్ని రోజుల క్రితం ఈ సీక్వెల్ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో స్టార్ట్ చేశారు.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఆపు చేస్తున్నట్లు జేమ్స్ కామెరూన్ అధికారికంగా ప్రకటించారు. ‘ఈ సినిమాలో రియల్ షూటింగ్స్ కంటే వర్చువల్ షూటింగ్‌కు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ వర్చువల్ వర్క్ చేసే సీజీ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం అమెరికాలో ఎక్కువగా ఉండటంతో వర్క్ ఆగింది. దీంతో ‘అవతార్ 2’ విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. 2022 సంవత్సరం డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు జేమ్స్ కామెరూన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com