టాలీవుడ్‌ సినిమా షూటింగ్స్‌ అన్నీ నిలిపివేత..

  • IndiaGlitz, [Monday,March 16 2020]

టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకుంది. నిశితంగా చర్చించిన అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఆదివారం సాయంత్రం ఫిల్మ్‌ ఛాంబర్‌లో సంయుక్తంగా సమావేశం నిర్వహించాయి. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా సోమవారం నుంచి ఈ నెల 21 వరకూ షూటింగ్‌లు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఈ భేటీలో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రెటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీలు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ఠాగుర్ మధు, రామా సత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆపేస్తున్నాం..
నారాయన దాస్ నారగ్ మాట్లాడుతూ...
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వ్యాధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. దీన్ని అందరూ సహకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారని తెలిపారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ & మా సంయుక్తంగా చిత్రీకరణ నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. కొందరు నిర్మాతలకు ఇబ్బంది ఉన్నా సరే నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 21 వరకూ థియేటర్లు మూసివేసి ఉంటాయని.. తర్వాత 31వరకూ బంద్‌ కొనసాగుతుందన్నారు.

అభ్యంతరం లేని ప్రాంతాల్లో..
ఈ సందర్భంగా సి కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ‘అందుబాటులో ఉన్న నిర్మాతలతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాం. 21 వరకు ప్రభుత్వ ఆదేశాలున్నందున ఆ రోజు వరకే మా కార్యచరణ ఉంటుంది. నిర్మాతలకు ఇబ్బంది ఉంటే కరోనా ఇబ్బందులు అనుకోవాలి. ఇతర ప్రాంతాల్లో షూటింగ్స్ లో ఉన్నవాళ్లు ఇబ్బంది లేకుంటే షూటింగ్స్ చేసుకోవచ్చు. థియేటర్ల బంద్, షూటింగ్స్ నిలిపేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ప్రాంతాల్లో షూటింగులు జరుగుతున్నాయి’ అని కల్యాణ్ తెలిపారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..
‘సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది. మేమంతా సమర్ధిస్తున్నాం. విదేశాల్లో చిత్రీకరణలు చేస్తున్న వారూ ప్యాకప్‌ చేసుకుని తిరిగి వస్తున్నారు. ’ అని మా కార్యదర్శి జీవితా రాజశేఖర్‌ మీడియా ముఖంగా తెలిపారు.

More News

మ‌రోసారి ప్ర‌భాస్ గురించి చెప్పిన అనుష్క ఏమందో తెలుసా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని, వారు పెళ్లి చేసుకుంటార‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాలుగా వార్త‌లు వినిపించాయి.

విశ్వ‌క్ సేన్‌ని ఆ సినిమాలో తీసేశారు.. త‌ర్వాత ఏమైందో తెలుసా?

ఇటీవ‌ల విడుద‌లైన ‘హిట్‌’తో హిట్ అందుకున్న హీరో విశ్వ‌క్‌సేన్‌. ఈ యంగ్ హీరో కెరీర్ సాఫీగా ఏం సాగిపోలేదు.

కలకలం.. గోల్కొండ టోలీచౌక్‌లో కరోనా అనుమానిత కేసు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న `ఈ కథలో పాత్రలు కల్పితం`

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో

అభిమానులారా.. నా ఇంటికి రాకండి : బిగ్‌బీ

కరోనా వైరస్ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.