దేశంలో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా.. నిన్న ఒక్కరోజే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విపరీతంగా విస్తరిస్తోంది. గుండెల్లో దడ పుట్టిస్తోంది. లక్ష కేసులు అంటేనే అమ్మో అనుకున్నాం కానీ లక్షదాటి రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తరగడం లేదు. మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 30,60,542కు చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 780 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులుండగా... కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తంగా 1,67,642 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 61,899 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 1,19,13,292 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రోగుల రికవరీ రేటు 91.67 శాతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రికవరీ రేటు పడిపోవడం ఆందోళన కలిిస్తోంది. కాగా అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.
ఇక దేశంలో ఎక్కువగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడే నమోదవుతుండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5 వేలకు పగా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 376 మంది మృతి చెందారు. టీకా కార్యక్రమం కూడా వేగవంతంగా సాగుతోంది. గురువారం నాటికి 9,43,34,262 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 36,91,511 డోసులు అందించినట్టు అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments