తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. ప్రతి 3 టెస్టులకు ఒక పాజిటివ్
- IndiaGlitz, [Sunday,June 28 2020]
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్న నిర్వహించిన టెస్టుల ప్రకారం చూస్తే ప్రతి మూడు టెస్టులకు గాను ఒక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. శనివారం రాష్ట్రంలో 3923 కరోనా టెస్టులు నిర్వహించగా.. 1087 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 13,436కు చేరుకుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 243కు చేరుకుంది. నిన్న కరోనాన నుంచి కోలుకుని 162 మంది డిశ్చార్జ్ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 4928కి చేరుకుంది. కాగా తెలంగాణలో 8265 యాక్టివ్ కేసులున్నాయి.
కాగా.. తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల పరంగా చూస్తే మొదటి నుంచి జీహెచ్ఎంసీ ప్రథమ స్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజే 888 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5, నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, ఆసీఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.