కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగు పెట్టింది: డబ్ల్యూహెచ్‌వో

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయేత కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ప్రస్తుతం వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ట్రెడ్రోస్ వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు విసుగెత్తిపోయారని.. ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్రమైన నష్టం జరిగిందని పేర్కొన్నారు.

వైరస్ వేగంగా విస్తరిస్తోందని.. దీంతో పెను ప్రమాదం పొంచి ఉందని ట్రెడ్రోస్ తెలిపారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 87 లక్షల 58వేల 270 నమోదయ్యాయి. అలాగే 4 లక్షల 62వేల 525 మంది ప్రాణాలు కోల్పోగా... కరోనా బారి నుంచి 46లక్షల 25వేల 525 మంది కోలుకున్నారు.