ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే..
- IndiaGlitz, [Saturday,July 25 2020]
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ కరోనా హెల్త్ బులిటెన్‌ను శనివారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 53,681 శాంపిళ్లను పరీక్షించగా.. 7,813 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 88671కి చేరుకుంది. నేడు ఒక్కరోజే 3,208 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 43255 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా ప్రస్తుతం ఏపీలో 44431 యాక్టివ్ కేసులున్నాయి. అయితే కరోనాతో నేడు గుంటూరులో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరిలో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఆరుగురు, విజయనగరంలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు.. మొత్తంగా 52 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కరోనాతో 985 మంది మృతి చెందారు.
#COVIDUpdates: 25/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 25, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను
*40,406 మంది డిశ్చార్జ్ కాగా
*985 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TIoAoChucE