ఏపీలో నేడు 7,948 కేసులు..

  • IndiaGlitz, [Tuesday,July 28 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిళ్లను పరీక్షించగా.. 7948 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,297కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 56,527 యాక్టివ్ కేసులున్నాయి. 52,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా నేడు కరోనాతో 58 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 1,148 మంది మృతి చెందారు. కాగా నేడు కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1367 కేసులు నమోదయ్యాయి. కాగా నేడు కరోనాతో గుంటూరులో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు మృతి చెందారు.

More News

ప్రముఖ నటుడు రావి కొండలరావు ఇక లేరు..

ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు నేడు మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు.

బాల‌య్య‌తో స్నేహ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

ఆ వ్యక్తి కనిపిస్తే దేహశుద్ధి తప్పదు: సింగర్ సునీత

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత చైతన్య అనే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మ‌రోసారి సామాజిక బాధ్య‌త‌ను తెలియ‌జేసిన మ‌హేశ్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రంగం అంతా స్తబ్దుగా మారింది. థియేట‌ర్స్  మూత‌ప‌డ్డాయి, సినిమా షూటింగ్స్ ఆగాయి.

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ త్రిభాషా చిత్రం...

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ త‌న‌యుడు మ‌మ్ముటి త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన దుల్క‌ర్ సల్మాన్ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.