దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. నిన్న కొత్తగా..

  • IndiaGlitz, [Sunday,December 13 2020]

భారత్‌లో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా బాగానే తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,57,029కి చేరుకున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా కొత్తగా 391 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా కారణంగా 1,43,019 మంది మృతి చెందారు. కాగా.. శనివారం ఒక్కరోజే కరోనా నుంచి 33,136 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 93,57,464 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,14,434 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,56,546 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 94.93 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు..

తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రధానితో కేసీఆర్ భేటీ.. పలు కీలక విషయాలపై చర్చ..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన కేసీఆర్..

కొత్త సినిమాలు విడుదల కష్టమేనట...

నిర్మాతలు, మల్టీప్లెక్స్‌ల మధ్య సయోధ్య కుదరనందున కొత్త సినిమాల విడుదల సందేహాస్పదంగానే మారిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

అరియానాకు క్లాస్.. సొహైల్‌కు టాప్ ఫైవ్..

‘చూస్తున్నా.. చూస్తూనే ఉన్నా..’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ముందుగా క్రితం రోజు ఏం జరిగిందో చూశారు.