ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. నేడు పాజిటివ్ కేసులకు సమానంగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అలాగే మరణాల సంఖ్య కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఏపీలో గడచిన 24 గంటల్లో 55,692 శాంపిళ్లను పరీక్షించగా.. 9,996 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... చిత్తూరు జిల్లాలో 963 కరోనా పాజిటివ్ కేసులు, విశాఖపట్నం జిల్లాలో 931, అనంతపురం 856, పశ్చిమ గోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకులం 425, కృష్ణా జిల్లాలో 330 కేసులు కొత్తగా నమోదయ్యాయి. అయితే ఏపీలో నేడు ఎన్ని కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆ కేసుల సంఖ్యకు సమానంగానే నేడు అంతేమంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 9,499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 1,70,924 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 90,840 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 82 మంది కరోనా కారణంగా మరణించగా.. ఇప్పటి వరకూ మొత్తం 2378 మరణించారు. కాగా.. నేడు తూర్పుగోదావరిలో 10 మంది, గుంటూరులో 10, అనంతపురంలో 8 మంది, కడపలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 6, నెల్లూరులో 6, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 6, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 5, కృష్ణ జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు.
#COVIDUpdates: 13/08/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 13, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,61,247 పాజిటివ్ కేసు లకు గాను
*1,68,029 మంది డిశ్చార్జ్ కాగా
*2,378 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 90,840#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/O1IAifmV2R
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments