ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే...
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కూడా ఏపీలో కరోనా విజృంభణ కొనసాగింది. మరణాలైతే ఎన్నడూ లేనంగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో 37,162 శాంపిళ్లను పరీక్షించగా.. 4944 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 58,668కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 62 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 758కి చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో 1,232 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 25,574 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో 32,336 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. కాగా నేడు పశ్చిమ గోదావరిలో అత్యధిక కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 21/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 21, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 55,773 పాజిటివ్ కేసు లకు గాను
*22,896 మంది డిశ్చార్జ్ కాగా
*758 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,119#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jyyvWPb548
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout