ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే...

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

ఆంధ్రప్రదేశ్ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కూడా ఏపీలో కరోనా విజృంభణ కొనసాగింది. మరణాలైతే ఎన్నడూ లేనంగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో 37,162 శాంపిళ్లను పరీక్షించగా.. 4944 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 58,668కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 62 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 758కి చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో 1,232 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 25,574 మంది డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో 32,336 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. కాగా నేడు పశ్చిమ గోదావరిలో అత్యధిక కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు నమోదయ్యాయి.

More News

ప్ర‌భాస్ 21లో దీపికా ప‌దుకొనె రోల్ ఏంటంటే..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ వారి 'Bకామ్ లో ఫిజిక్స్'

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు.

తొలిసారి ర‌కుల్ ప్ర‌య‌త్నం.. వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా మెప్పించి గుర్తింపు సంపాదించుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

మ‌ణిర‌త్నం బాట‌లో సుకుమార్‌..?

తెలుగు చిత్ర‌సీమ‌లో నేటిత‌రం బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో సుకుమార్ ఒక‌రు. ‘రంగ‌స్థ‌లం’ త‌ర్వాత  అల్లు అర్జున్‌తో ‘పుష్ప‌’ అనే ప్యాన్ ఇండియా మూవీ

రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై కీలక వార్త వెలుగులోకి..

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని దేశాలూ పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.