ఏపీలో భయాందోళన రేకెత్తిస్తున్న కరోనా కేసులు..
- IndiaGlitz, [Saturday,July 11 2020]
ఏపీలో కరోనా కేసులు భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 20,590 శాంపిళ్లను పరిశీలించగా 1813 కేసులు నమోదయ్యాయి. వీటిలో రాష్ట్రానికి చెందినవి 1775 కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మందికి.. విదేశాలకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27 వేల 235కు చేరుకుంది.
కాగా గడిచిన 24 గంటల్లో 17 మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురికి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరికి చొప్పున.. అనంతపురం, విశాఖ, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 12533 యాక్టివ్ కేసులుండగా.. 14393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
#COVIDUpdates: 11/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 11, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 24,422 పాజిటివ్ కేసు లకు గాను
*12,399 మంది డిశ్చార్జ్ కాగా
*309 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,714#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/eeeOs6rUWb