దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..

భారత్‌ను సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కలవరపెడుతోంది. ఊహించని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది కూడా చూడనంతగా.. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అంతా ప్రశాంతం అనుకున్న సమయంలో సెకండ్ వేవ్ కలకలం మొదలైంది. అయినప్పటికీ ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే కరోనా మొదలైనప్పటి నుంచి రెండు రోజుల క్రితం వరకూ లక్ష కేసులు దాటింది లేదు. కానీ తొలిసారిగా రెండు రోజుల క్రితం లక్ష మార్కును దాటేసి షాకిచ్చాయి. ఇక గడిచిన 24 గంటల విషయం చెప్పాలంటే అదో రికార్డే. మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో చెప్పేందుకు ఇదో నిదర్శనం.

దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. మరోసారి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,15,736 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తొలిసారిగా రెండు రోజుల క్రితం కోవిడ్ కేసులు లక్ష(1,03,558) మార్కును దాటాయి. తాజాగా ఇంతకు మించి మరో 12 వేలకు పైగా కేసులు అదనంగా నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా తీవ్ర స్థాయిలో ఉండటం కలవరానికి గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 630 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.28 కోట్లకు చేరింది.

అలాగే కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,66,177కు చేరుకుంది. కాగా.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,43,473గా ఉండగా.. కోలుకుంటున్న వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉండటం కాస్త ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 59,856 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,17,92,135కు చేరుకుంది. కాగా.. రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. కాగా.. గడిచిన 24 గంటల్లో 12,08,329 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యలో సైతం పెరుగుదల గణనీయంగా ఉంది.

More News

తమన్నా ‘లెవెన్త్ అవర్’ ట్రైలర్ అదిరిపోయింది..

కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఓటీటీల హవా బీభత్సంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్

సినీ థియేటర్లకు జగన్ సహకారం.. ధన్యవాదాలు చెప్పిన చిరు

కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న దీనికి తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం తన సహకారాన్ని అందించి

వరుణ్‌కి సాయిపల్లవితో పెళ్లి.. నాగబాబు ఫన్నీ రిప్లై

ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానులతో తరచూ టచ్‌లో ఉంటూ వారు అడిగే సిల్లీ క్వశ్చన్స్‌కి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా అంతకు మించి

అభిమానుల అత్యుత్సాహం.. అజిత్ ఆగ్రహం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేడు జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ స్టార్ హీరోలంతా తమకు కేటాయించిన

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది.