ఏపీలో షాకింగ్: హడలెత్తించిన కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..
- IndiaGlitz, [Wednesday,July 15 2020]
ఏపీలో షాకింగ్ స్థాయిలో నేడు కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కరోనా కేసులు హడలెత్తించాయి. గడిచిన 24 గంటల్లో 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 44 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 452 మంది మృతి చెందారు.
అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, కర్నూలు జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒకరు చొప్పున మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 805 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,378కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 15/07/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 15, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 32,575 పాజిటివ్ కేసు లకు గాను
*16,032 మంది డిశ్చార్జ్ కాగా
*452 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,091#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/6WuLQwncaX