దేశంలో విజృంభించిన మహమ్మారి.. 60 వేలకు చేరువలో కేసులు

  • IndiaGlitz, [Saturday,March 27 2021]

కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా వరకూ తగ్గిపోయాయి. దాదాపు ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా కేసులు పెద్దగా నమోదవడం లేదు. దీంతో అంతా ఇక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయనే భావించారు. కానీ ఒక్కసారిగా మహమ్మారి విజృంభించింది. గతంలో పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఏ రేంజ్‌లో అయితే కేసులు నమోదయ్యాయో తిరిగి తాజాగా అవే పరిస్థితులు నెలకొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు 60 వేలకు చేరువలో నమోదవడం గమనార్హం. కరోనా మరణాలు సైతం వందల సంఖ్యలో నమోదయ్యాయి.

తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 59,118 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంత పెద్ద మొత్తంలో కేసులు గతేడాది అక్టోబర్‌లో కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 36 వేల కేసులు నమోదవడం గమనార్హం. కరోనా కారణంగా 257 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క మహారాష్ట్రలోనే 112 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు పెద్ద మొత్తంలో పెరుగుతున్నందున మహారాష్ట్రలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు.

కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,18,46,652 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 1, 60,949కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,21,.66 యాక్టివ్ కేసులున్నాయి. ఆ రేటు 3.55 శాతానికి చేరుకుంది. తాజాగా 32,987 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,12,64,637 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 23,58,731 టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ 5.55 కోట్ల మందికి కరోనా టీకాలను అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

More News

‘ఆచార్య’తో కలిసి సిద్ద... సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను అందజేసింది.

‘రంగ్ దే’ తొలిరోజు వసూళ్లివే...

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు.

'రంగ్ దే'ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థాంక్స్‌.. ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీ - నితిన్‌

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'రంగ్ దే'.

చిత్తూరులో స్కూల్‌నే బార్‌గా మార్చేసిన ‘నీచర్’!

ఆ ఉపాధ్యాయుడి పేరు కోటేశ్వరరావు అలియాస్ శ్రీధర్. పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్‌ ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రేపు(శనివారం). ఈ సందర్భంగా ఆయన ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసేశాడు.