దేశంలో విజృంభించిన మహమ్మారి.. 60 వేలకు చేరువలో కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా వరకూ తగ్గిపోయాయి. దాదాపు ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా కేసులు పెద్దగా నమోదవడం లేదు. దీంతో అంతా ఇక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయనే భావించారు. కానీ ఒక్కసారిగా మహమ్మారి విజృంభించింది. గతంలో పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఏ రేంజ్‌లో అయితే కేసులు నమోదయ్యాయో తిరిగి తాజాగా అవే పరిస్థితులు నెలకొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు 60 వేలకు చేరువలో నమోదవడం గమనార్హం. కరోనా మరణాలు సైతం వందల సంఖ్యలో నమోదయ్యాయి.
తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 59,118 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంత పెద్ద మొత్తంలో కేసులు గతేడాది అక్టోబర్‌లో కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 36 వేల కేసులు నమోదవడం గమనార్హం. కరోనా కారణంగా 257 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క మహారాష్ట్రలోనే 112 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు పెద్ద మొత్తంలో పెరుగుతున్నందున మహారాష్ట్రలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు.
కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,18,46,652 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 1, 60,949కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,21,.66 యాక్టివ్ కేసులున్నాయి. ఆ రేటు 3.55 శాతానికి చేరుకుంది. తాజాగా 32,987 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,12,64,637 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 23,58,731 టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ 5.55 కోట్ల మందికి కరోనా టీకాలను అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments