గోదావరి జిల్లాను కుదిపేస్తున్న కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా కర్నూలును తూర్పు గోదావరి జిల్లా బీట్ చేసేసింది. ఈ జిల్లాను కరోనా కుదిపేస్తోంది. శనివారం ఒక్కరోజే అక్కడ వెయ్యికి పైగా కేసులు నమోదవడం విశేషం. శనివారం 1130 కేసులు నమోదవగా.. తాజాగా కేసుల సంఖ్య దాదాపు 7000లకు చేరుకుంది. ముఖ్యంగా కాకినాడ నగరంలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి రోజురోజుకూ భయాందోళనలు కలిగిస్తోంది. ముఖ్యంగా 12 డివిజన్లలో మొత్తంగా 350 మంది కరోనా బారిన పడ్డారు.
ముఖ్యంగా కాకినాడ నగరం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. ఇక్కడ ఒక్కచోటే వందల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరం మొత్తం రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లే దర్శనమిస్తున్నాయి. మరోవైపు రాజమండ్రిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. వందల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అసలు వైరస్ ఎలా వ్యాపించింది? ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను సైతం గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో పాజిటివ్ వ్యక్తుల సంబంధీకులు ఇతరులు అలర్ట్ అయి స్వచ్ఛందంగా వారే వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు.
ఇక గవర్నమెంట్ సెక్టార్‌లో పిన చేస్తున్న ఉద్యోగుల్లో కూడా ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఐటీడీఏ ఆర్‌వోఎఫ్‌ఆర్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ముమ్మడివరంలో ఒక వీఆర్వోకు కరోనా సోకింది. ఎటపాక సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో నలుగురు జవాన్లకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇక్కడ మొత్తం 26 మంది కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. ప్రతిరోజూ కోవిడ్ మరణాల్లో జిల్లా నుంచే దాదాపు ఆరు ఉండటం గమనార్హం. కాగా.. శనివారం రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో అనస్తీషియా విభాగం హెచ్‌వోడీగా పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ కొవిడ్ బారినపడి మృతి చెందారు.
జిల్లా ఒకరకంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి యుద్ధ ప్రాతిపదికన 12 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అలాగే నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ కారణంగా కేసుల సంఖ్యలో మార్పులు వచ్చేది లేనిది? చూసి వచ్చే ఆదివారం కర్ఫ్యూని ఉంచాలో.. తీసివేయాలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 126 పీహెచ్‌సీల్లో ఆక్సీజన్ అందుబాటులోకి తీసుకు రానున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో కరోనాను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout