ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు మరోసారి 10 వేలకు పైగా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరుసగా 10 వేలు నమోదైన కేసులు మధ్యలో కాస్త తగ్గాయి. తిరిగి మూడు రోజులుగా మరోసారి 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 61,331 శాంపిళ్లను పరీక్షించగా.. 10,526 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 4,03,616కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 35,41,321 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
అయితే ఒక్కరోజులో 8463 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా... గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,714కి చేరుకుంది. కాగా నేడు చిత్తూరు జిల్లాలో 10 మంది, కడప తొమ్మిది మంది, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరులో నలుగురు, విజయనగరం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
#COVIDUpdates: 28/08/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 28, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,00,721 పాజిటివ్ కేసు లకు గాను
*3,00,816 మంది డిశ్చార్జ్ కాగా
*3,714 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,191#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/taKk5r8lNS
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments