హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4.0 నుంచి కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలే తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. బుధవారం ఒక్కరోజే 129 కరోనా కేసులు నమోదైనట్లుగా తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా నమోదైన ఈ కేసుల్లో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా.. మరో 02 కరోనా కేసులు వలసకార్మికులకు చెందినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3020కు చేరుకుంది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2572 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. అయితే, బుధవారం మరో ఏడుగురు కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 99కి చేరుకుంది.
భాగ్యనగరంలో భారీగా..!
జిల్లాల వారిగా చూస్తే.. బుధవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదుకావడం కలవరపాటు గురయ్యే విషయం. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, ఆసిఫాబాద్‌లో 6, మేడ్చల్, సిరిసిల్లలో 2 కేసుల చొప్పున, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా్ల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులను గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారు రాష్ట్రంలో 1556 మంది కాగా, యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 1365 ఉన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులతో హైదరాబాదీలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఈ సడలింపులతో జనాలు ఇష్టానుసారం తిరిగేయడం, షాపులు తెరవడం.. పైగా టెస్టుల్లో గజిబిజి జరుగుతోందని నిపుణులు, విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments