దేశంలో ఒక్కరోజే 20 వేలు దాటిన కరోనా కేసులు..

  • IndiaGlitz, [Friday,July 03 2020]

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ అనంతరం కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20 వేల 903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షల 25 వేల 544కు చేరుకుంది. కాగా.. దేశ వ్యాప్తంగా 2 లక్షల 27 వేల 439 యాక్టివ్ కేసులుండగా.. 3 లక్షల 79వేల 892 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు దేశ వ్యాప్తంగా 379 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 18213 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా కరోనా కేసుల పరంగా ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న రష్యాను ఒకట్రెండు రోజుల్లోనే ఇండియా దాటేసే అవకాశం ఉంది.

More News

కరోనా అంతమైందంటూ పార్టీ.. వేలల్లో హాజరైన ప్రజలు

కరోనా కారణంగా ప్రపంచమే వణికిపోతుంటే.. ఓ దేశంలో మాత్రం ‘కరోనా వైరస్ పార్టీ’ పేరుతో పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం జరిగింది.

లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన

చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైన్యంలో ధైర్యాన్ని నింపేందుకు యత్నాలు జరుగుతున్నాయి.

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్!

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నీ ఓకే అయితే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. షాకిచ్చిన రఘురామ కృష్ణరాజు

ఎత్తులకు పై ఎత్తులతో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ ఇక లేరు..

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) మరణించారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.