కరోనా కేసుల్లో ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా.. ఏం జరుగుతోంది!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. అయితే ఏపీలో మాత్రం డబుల్ డిజిట్‌లో ఉదాహరణకు 71 అలా కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో మాత్రం సింగిల్ డిజిట్‌లోనే అనగా.. 07 అని మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వ్యత్యాసంతో ఏపీలో ఎందుకు పెరుగుతున్నాయ్.. తెలంగాణలో ఎందుకు తగ్గుతున్నాయ్ అనేదానిపై అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. అసలు ఆ లెక్కలేంటో.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కరోనా టెస్ట్‌లు పరంగా పాజిటివిటీ రేటును బట్టి చూస్తే...
ఇండియా మొత్తమ్మీద..: 4.2
రాజస్థాన్ : 20.55 (70,167)
పశ్చిమ బెంగాల్ : 14.52
మధ్యప్రదేశ్ : 8.78
న్యూ ఢిల్లీ : 8.38
మహారాష్ట్ర : 7.47
గుజరాత్ : 6.46
ఛత్తీస్‌ఘడ్ : 4.76
జమ్ము కశ్మీర్ : 3.75
తమిళనాడు : 2.42
ఉత్తరప్రదేశ్ : 2.41
కేరళ : 2.09
ఆంధ్రప్రదేశ్ : 1.58 (61,266)
హర్యానా : 1.52
కర్ణాటక : 1.3
తెలుగు రాష్ట్రాల్లో తేడా ఎందుకు!?
ఏపీ విషయానికొస్తే.. సగడటును పది లక్షల మందికి గాను 1,018 మందకి కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే తెలంగాణ విషయానికొస్తే సీన్ పూర్తిగా రివర్స్ ఉందని అందుకే పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసుల సంఖ్యను దాస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే ఇందులో నిజానిజాలెంత అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక.
కేసుల సంఖ్య..
ఏపీలో ఇప్పటి వరకూ 1177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాడు కూడా ఇలాగే 81 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అయితే భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1001 (ఆదివారం బులెటిన్). నిన్న ఒక్కరోజే కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసులన్నీ హైదరాబాద్‌కు చెందినవే కావడం గమనార్హం.
మొత్తానికి చూస్తే.. ఏపీలో కేసులు పెరగడం వెనుక ఆంతర్యమేంటో ఇప్పటికైనా విమర్శకులు తెలుసుకుంటే మంచిదని ప్రభుత్వం పరోక్షంగా ఇలా లెక్కలు చూపించి మరీ పంచ్‌లు ఇస్తోంది. ప్రతిపక్షాల నోరు మూయడానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా కష్టకాలంలో మనకు తోచినంత ఇతరులకు సాయం చేయడం.. వీలుకాకుంటే మన ఇంట్లో మనం సేఫ్‌గా ఉంటే అదే చాలు.. ఇంతకుమించి ఏమీ చేయనక్కర్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments