దేశంలో 3 నెలల కనిష్టానికి కరోనా కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దాదాపు 80 లక్షలకు చేరువయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కాగా.. మరోవైపు కరోనా కేసులు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. మూడు నెలల తరువాత తొలిసారిగా 40 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం జూలై 23న 45 వేల కేసులు నమోదు కాగా.. ఆ తరువాత తిరిగి ఆదివారం అంతకంటే తక్కువగా 45,148 కేసులు నమోదయ్యాయి. కాగా.. నేడు 40 వేల కంటే తక్కువగా కేసులు నమోదవడం గమనార్హం. రికవరీ రేటు కూడా బాగా పెరుగుతుండటం ఉపశమనాన్ని కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 79,46,429కి చేరుకుంది.
కాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 488 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,19,502 మంది మృతి చెందారు. కాగా.. ప్రస్తుతం దేశంలో 6,25,857 మందికి చికిత్స కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 63,842 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనా నుంచి 72,01,070 మంది కోలుకున్నారు. కాగా.. దేశంలో రికవరీ రేటు 90.62 శాతం ఉండగా.. మరణాల రేటు 1.50 శాతం ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments