దేశంలో 3 నెలల కనిష్టానికి కరోనా కేసులు..

  • IndiaGlitz, [Tuesday,October 27 2020]

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దాదాపు 80 లక్షలకు చేరువయ్యాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కాగా.. మరోవైపు కరోనా కేసులు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. మూడు నెలల తరువాత తొలిసారిగా 40 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం జూలై 23న 45 వేల కేసులు నమోదు కాగా.. ఆ తరువాత తిరిగి ఆదివారం అంతకంటే తక్కువగా 45,148 కేసులు నమోదయ్యాయి. కాగా.. నేడు 40 వేల కంటే తక్కువగా కేసులు నమోదవడం గమనార్హం. రికవరీ రేటు కూడా బాగా పెరుగుతుండటం ఉపశమనాన్ని కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 79,46,429కి చేరుకుంది.

కాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 488 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,19,502 మంది మృతి చెందారు. కాగా.. ప్రస్తుతం దేశంలో 6,25,857 మందికి చికిత్స కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 63,842 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనా నుంచి 72,01,070 మంది కోలుకున్నారు. కాగా.. దేశంలో రికవరీ రేటు 90.62 శాతం ఉండగా.. మరణాల రేటు 1.50 శాతం ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

రణరంగంలా మారిన దుబ్బాక..

దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. దుబ్బాక ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీల ముఖ్య నేతలంతా సిద్దిపేటకు చేరుకోవడంతో రణరంగాన్ని తలపిస్తోంది.

అమ్మో.. రాజశేఖర్..

ఇవాళ నామినేషన్స్ పర్వం నడిచింది. అమ్మ రాజశేఖర్ చేసిన రచ్చ మామూలుగా లేదు. నామినేట్ చేయడానికి కారణాలను వెదుక్కుని మరీ రచ్చ రచ్చ చేసేశారు.

నాయిని సతీమణి మృతి.. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణించి ఐదు రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి అహల్య(68) మరణించారు.

సాయితేజ్ కొత్త సినిమా టైటిల్‌...?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్.

ఆ సీన్‌ను తొలగించండి: ‘ఆర్ఆర్ఆర్’పై భీం మునిమనవడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.