తెలంగాణలో లక్ష దాటిన కేసులు.. రాష్ట్రంలో కొత్తగా..

  • IndiaGlitz, [Saturday,August 22 2020]

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. శనివారం హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటేసింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 24004 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 2474 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 1865కు చేరుకుంది.

కాగా.. నేడు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 744 మంది కరోనాతో మృతి చెందారు. కాగా తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1768 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకూ మొత్తం 78735 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 22386 యాక్టివ్ కేసులున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 15933 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా నేడు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 447 కేసులు నమోదవగా.. రంగారెడ్డి-201, నిజామాబాద్-153, మేడ్చెల్-149, ఖమ్మం-125, వరంగల్ అర్బన్- 123, నల్గొండ-122, సిద్దిపేట-92 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇంకా 1239 శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'జీ 5' ఒరిజిన‌ల్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సుష్మితా కొణిదెల

మెగాభిమానులకు ఆగస్టు 22న పెద్ద పండగ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు.

స‌మంత ఛాలెంజ్‌.. స‌క్సెస్ అవుతుందా?

లాక్‌డౌన్ స‌మయంలో సినీ సెల‌బ్రిటీలు ఇంటికే ప‌రిమిత‌మై కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా..

డీ గ్లామ‌ర్ పాత్ర‌లో ర‌కుల్‌..?

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అడ‌పా ద‌డ‌పా హిందీ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

రావ‌ణుడి పాత్ర‌కు ఆ స్టార్ ఓకే అంటాడా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం.

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని దేశం మొత్తం కాక్షింస్తోంది. కరోనాతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యంలో మార్పేమీ లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.