వరుసగా ఆరో రోజు 50 వేలు దాటిన కరోనా కేసులు..
- IndiaGlitz, [Tuesday,August 04 2020]
దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కరోనా కేసులు దేశంలో 50 వేలకు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య కూడా 18.55 లక్షలకు పైనే చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో 52,050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,746కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 803 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం 38,938 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,86,298 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 12,30,510కి చేరుకుంది. కాగా దేశంలో రికవరీ రేట్ 66 శాతానికి చేరుకుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) August 4, 2020
(As on 4 August, 2020, 08:00 AM)
▶️ Confirmed cases: 1,855,745
▶️ Active cases: 586,298
▶️ Cured/Discharged/Migrated: 1,230,509
▶️ Deaths: 38,938#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHI
Via @MoHFW_INDIA pic.twitter.com/BKdzS6Fb6a