ఏపీలో ఊరటనిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

  • IndiaGlitz, [Monday,August 03 2020]

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పది వేలకు పైగా నమోదైన కేసులు నిన్న 8 వేలు నమోదవగా.. నేడు మరికొంత తగ్గాయి. ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 45,516 శాంపిళ్లను పరీక్షించగా.. 7822 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కు చేరుకుంది. నేడు ఒక్క రోజే 63 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1534కు చేరుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 76,377 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 88,672 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది, ప్రకాశంలో 8 మంది, నెల్లూరు, శ్రీకాకుళంలలో ఏడుగురు చొప్పున, విజయనగరంలో నలుగురు, చిత్తూరు, కృష్ణా, కర్నూలులో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కడపలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కాగా రాష్ట్రంలో నేటి వరకూ 21,10,923 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

48 గంటలు టైమిస్తున్నా.. అసెంబ్లీని రద్దు చేసి రండి: చంద్రబాబు సవాల్

మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్..

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మరో అడుగు ముందుకు పడింది.

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్..

కరోనా మహమ్మారి కారణంగా సెలబ్రిటీల పెళ్లిలన్నీ సింపుల్‌గా జరిగిపోతున్నాయి.

హిట్ డైరెక్ట‌ర్‌ని లాక్ చేసిన మైత్రీ మూవీస్‌..!!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో

ఛానెల్ ఎడిట‌ర్‌పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌ల‌కు మేక‌ర్స్ దూరంగా ఉంటున్నారు.