దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు

  • IndiaGlitz, [Monday,May 24 2021]

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 19,28,127 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, కరోనాతో 4,454 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య ఇప్పటి వరకూ 3,03,720కు చేరుకుంది.

కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుండటం గమనార్హం. కాగా.. దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,67,52,447కు చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 27,20,716 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 3 లక్షల మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.37 కోట్లకు చేరుకుంది. రికవరీ రేటు 88.69 శాతంగా ఉంది.

కాగా.. గడిచిన 24 గంటల్లో ఎక్కువగా తమిళనాడులోనే కేసులు వెలుగు చూశాయి. తమిళనాడులో నిన్న 35 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య కొంత తగ్గింది. మరోవైపు నిన్న 9,42,722 మందికి టీకాలు అందాయి. మొత్తంగా 19.60 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

More News

రాంగోపాల్ వర్మ సోదరుడు మృతి.. బోనీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన సోమశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనాతో భాదపడుతున్న

కొవాగ్జిన్ తీసుకున్నారా? అయితే ఆ దేశాల్లోకి నో ఎంట్రీ..

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అనే నిబంధనను పలు దేశాల్లో అమల్లోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే గల్ఫ్‌ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి.

ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదు: అనిల్ కుమార్ సింఘాల్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీకి క్రమక్రమంగా లైన్ క్లియర్ అవుతోంది. పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

టీకా వేసుకుంటే బీరు ఫ్రీ.. అంతేకాదు..

అమెరికాలో హామీల వర్షం కురుస్తోంది. ఏదైనా ఎన్నికలా.. ఆల్రెడీ పూర్తయ్యయి కదా అని ఆలోచిస్తున్నారా? ఎన్నికల హామీలు కావవి.. ప్రస్తుతం అమెరికాలో ఉచిత కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.

హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్

జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ (23) హత్య కేసులో నిందితుడిగా ఉన్న డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత 15 రోజులుగా సుశీల్ పరారీలో ఉన్నాడు.