దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 19,28,127 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, కరోనాతో 4,454 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య ఇప్పటి వరకూ 3,03,720కు చేరుకుంది.
కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుండటం గమనార్హం. కాగా.. దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,67,52,447కు చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 27,20,716 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 3 లక్షల మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.37 కోట్లకు చేరుకుంది. రికవరీ రేటు 88.69 శాతంగా ఉంది.
కాగా.. గడిచిన 24 గంటల్లో ఎక్కువగా తమిళనాడులోనే కేసులు వెలుగు చూశాయి. తమిళనాడులో నిన్న 35 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో దేశం మొత్తమ్మీద మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య కొంత తగ్గింది. మరోవైపు నిన్న 9,42,722 మందికి టీకాలు అందాయి. మొత్తంగా 19.60 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout