తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య

  • IndiaGlitz, [Friday,July 10 2020]

తెలంగాణలో గురువారానికి సంబంధించిన కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. అయితే కొద్ది రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గాయి. కొద్ది రోజులుగా తెలంగాణలో 1800లకు పైన పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. గురువారం 5954 శాంపిళ్లను పరిశీలించగా.. 1410 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,946కు చేరుకుంది. 12423 యాక్టివ్ కేసులుండగా.. 18192 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నిన్న కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మరణాల సంఖ్య 331కి చేరుకుంది. జీహెచ్ఎంసీలో మాత్రం కరోనా విజృంభణ కొనసాగుతోంది. గురువారం కూడా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 918 కేసులు నమోదయ్యాయి.

More News

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. శుక్రవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వికాస్ దూబేను కాల్చి చంపేశారు.

ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటోన్న తనీష్ 'మహాప్రస్థానం'

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మహాప్రస్థానం. ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై హైకోర్టులో విచారణ

డిగ్రీ, పీజీ పరీక్షల రద్దు చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

తెలంగాణలో దారుణం.. హాస్పిటల్ బయటే కుప్పకూలి వ్యక్తి మృతి

కరోనా కారణంగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.

హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అవుతున్న ఫైట‌ర్‌

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.