తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Monday,August 10 2020]

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా కరోనాతో 637 మంది మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 57,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. జీహెచ్ఎంసీ 389, రంగారెడ్డి 86, సంగారెడ్డి 84, కరీంనగర్‌ 73 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 6,24,840 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.