దేశంలో 54 రోజుల కనిష్టానికి కరోనా కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా మహమ్మారి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది. 54 రోజుల కనిష్టానికి కేసుల సంఖ్య చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం వరకూ రోజురోజుకూ పెరుగుతూ పోయిన కేసుల సంఖ్య.. గత 8 రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజా గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో.. లక్షా 50 వేల లోపునే కేసులు నమోదైనా.. మృతుల సంఖ్య మాత్రం మూడువేలకు పైగానే నమోదయ్యిందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌ను విడుదల చేసింది.
ఇదీ చదవండి: నేటి నుంచి బ్యాంకుల పనివేళల్లో మార్పులు
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,81,75,044కు చేరుకుంది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 3,128 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనాతో 3,31,895 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులున్నాయి. 43 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షలకు దిగువన ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో రికవరీ రేటు కూడా పెరుగుతుండటం కొంత వరకు ఊరటనిస్తోంది.
ప్రస్తుతం రికవరీ రేటు 92.09%గా ఉంది. ప్రస్తుతం దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 8.64% ఉండగా... డైలీ పాజిటివిటీ రేటు 6.62% కి పడిపోతోంది. వారం రోజులుగా వరుసగా 10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు నమోదవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం కూడా.. గణనీయంగా పెరిగింది. మొత్తం 34.67 కోట్ల పరీక్షలు ఇప్పటి వరకూ నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 21.6 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని మంత్రిత్వ శాఖ బులిటిన్ విడుదల చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com