తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా కేసులు..

  • IndiaGlitz, [Friday,July 17 2020]

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు 40 వేలు దాటేశాయి. తాజాగా కరోనా బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జులై 15 నాటికి 39,342 కరోనా కేసులుండగా.. 16నాటికి 41,018కి కరోనా కేసులు చేరుకున్నాయి. కాగా.. నిన్న ఒక్కరోజే 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 396కి చేరుకుంది. నిన్న కరోనా నుంచి కోలుకుని 1296 మంది డిశ్చార్జ్ అవగా.. మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 27,295కి చేరుకుంది.

కాగా తెలంగాణలో 13,328 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. తెలంగాణలో నిన్నటి వరకూ 2 లక్షల 22,693 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా గాంధీ హాస్పిటల్‌లో 1890 బెడ్లు ఉండగా.. ఐసీయూలో 113 మంది.. వార్డుల్లో 103 మంది.. 419 మందికి ఆక్సీజన్ అందిస్తున్నామని.. మొత్తంగా 635 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1255 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

గిరిజన విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సెంథిల్..

ధర్మపురి ఎంపీ సెంథిల్ కుమార్ గిరిజన విద్యార్థులకు సాయమందించేందుకు ముందుకొచ్చారు.

విజయ్ దేవరకొండ 'ఇన్ స్టా గ్రామ్' లో 8 మిలియన్ ఫాలోయర్స్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..

కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ..

టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.