తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు 40 వేలు దాటేశాయి. తాజాగా కరోనా బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గురువారం ఒక్కరోజే 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జులై 15 నాటికి 39,342 కరోనా కేసులుండగా.. 16నాటికి 41,018కి కరోనా కేసులు చేరుకున్నాయి. కాగా.. నిన్న ఒక్కరోజే 10 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 396కి చేరుకుంది. నిన్న కరోనా నుంచి కోలుకుని 1296 మంది డిశ్చార్జ్ అవగా.. మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 27,295కి చేరుకుంది.
కాగా తెలంగాణలో 13,328 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. తెలంగాణలో నిన్నటి వరకూ 2 లక్షల 22,693 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా గాంధీ హాస్పిటల్లో 1890 బెడ్లు ఉండగా.. ఐసీయూలో 113 మంది.. వార్డుల్లో 103 మంది.. 419 మందికి ఆక్సీజన్ అందిస్తున్నామని.. మొత్తంగా 635 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1255 బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout