తెలంగాణలో 2 వేలు దాటిన కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. గత ఏడాది కరోనా భయానకం సృష్టిస్తున్న సమయంలో నమోదైనన్ని కేసులు తాజాగా నమోదవుతుండటం గమనార్హం. రోజు వారీ కరోనా కేసులు రెండు వేలు దాటాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న రాత్రి 8గంటల వరకు 87,332 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... తెలంగాణలో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704 కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు మృతి చెందగా.. మొత్తం ఇప్పటి వరకూ 1,741 మంది మరణించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారి నుంచి 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల రేటు 0.54 శాతం ఉండగా.. కోలుకున్న వారి రేటు 95.26 శాతంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout