ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Monday,July 27 2020]

ఏపీలో కరోనా కేసులు నేడు కాస్త తగ్గాయి. దీనికి ఇవాళ కాస్త తక్కువగా పరీక్షలు నిర్వహించడం కూడా కారణమై ఉండవచ్చు. రోజూ 50 వేలకు పైన పరీక్షలు నిర్వహిస్తుండగా.. నేడు 43,127 శాంపిళ్లను పరీక్షించినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసులు మాత్రం లక్ష దాటడం గమనార్హం. ఏపీకి చెందిన కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 6051 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,349కు చేరుకుంది. కాగా ప్రస్తుతం ఏపీలో 51,701 యాక్టివ్ కేసులున్నాయి. 49,558 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు ఒక్కరోజే కరోనాతో 49 మంది మృతి చెందగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 1090 మంది మృతి చెందారు. కాగా నేడు కూడా ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో 1210 కేసులు నమోదయ్యాయి.

More News

హెచ్చ‌రిక‌..న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా:  శ్ర‌ద్ధాదాస్‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని నిర్వాహ‌కులు అధికారికంగా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో భారీ చిత్రం

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్

పొలిటికల్ టర్న్ తీసుకున్న సోనూసూద్ ట్రాక్టర్ వ్యవహారం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ‘సోనూసూద్’. విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కరోనా మహమ్మారి

ఫ్యాన్స్ సంద‌డితో మ‌హేశ్ స‌రికొత్త రికార్డ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన న‌టుడ‌ని కూడా చెప్పొచ్చు.

క‌రోనా దెబ్బ... రూ.2 కోట్లు న‌ష్టం

హీరోగా, నిర్మాత‌గా సినిమాలు చేస్తున్నారు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌.