నెల్లూరు వాసికి కరోనా.. థియేటర్స్ బంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తికి వైద్యపరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన ఎక్కడ్నుంచి వచ్చాడు..? ఇదివరకు ఎక్కడెక్కడ తిరిగాడు..? ఆయన విదేశాలనుంచి వచ్చాడా..? లేకుంటే అసలేం జరిగింది..? అని ఆరాతీయగా.. ఆ వ్యక్తి కొన్నిరోజుల క్రితమే ఇటలీ నుంచి నెల్లూరు వచ్చినట్లు తేలింది. వాస్తవానికి ఇప్పుడు ప్రాణాంతక వైరస్ చైనాతో ఎలా కొట్టుమిట్టాడుతోందో.. ఇటలీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటలీలో ఈ మహమ్మారి భారీన పడి చాలా మందే కన్నుమూశారు. చాలా మందికి ఈ వైరస్ సోకింది కూడా. అయితే ఆ ఇటలీకి చెందిన కొందరు ఇటీవలే ఏపీలోని నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆయన ఇటలీ వెళ్లి నెల్లూరుకు వచ్చారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయ్.
ఫస్ట్ కేసు!
దీంతో నెల్లూరు వాసికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. మొదట జ్వరం, జలుబు, దగ్గు తదితర కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఆ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి తిరుపతిలోని స్విమ్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా, కరోనా సోకినట్టు తేలింది. మరో రెండు వారాల తర్వాత అతనికి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. నెల్లూరు కేసే రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు.
థియేటర్స్ మూసేయండి..
కాగా.. కరోనా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మొత్తం థియేటర్స్ అన్నీ బంద్ చేయాలని థియేటర్ల యాజమాన్యానికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. ఒకట్రెండు కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్స్ మూసివేయాల్సిందేనని.. మళ్లీ రీ ఓపెన్ ఎప్పుడనేది కూడా తాము ప్రకటిస్తామని.. అంతవరకూ మూసివేయాలని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా.. జనాలు ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో ఆయన తిరిగినా త్వరగా కరోనా సోకిపోతుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదని ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం జనసంచారం ఎక్కువ ఉండే థియేటర్స్‌ను క్లోజ్ చేయిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com