మారిన కరోనా కాలర్ ట్యూన్..
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని నెలలుగా మన అనుమతి లేకుండానే మన ఫోన్లోకి కాలర్ ట్యూన్ చొచ్చుకొచ్చింది. దీనిపై సెటైర్లు, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. విని వినీ జనం విసిగిపోయారు. అయితే తాజాగా ఈ కాలర్ ట్యూన్ మారిపోయింది. హమ్మయ్యా.. అని సంబరపడి పోకండి.. ఇప్పటికే మీరు గమనిస్తే మీ మొబైల్లో మరో కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. అది కూడా ప్రమేయం లేకుండానే.. శనివారం వరకూ ‘నమస్కారం’ అంటూ కోవిడ్ 19 నిబంధనలు కాలర్ ట్యూన్‌గా వినిపించేవన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
అయితే శనివారం దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలర్ ట్యూన్ కూడా మారిపోయింది. ఇప్పటి వరకూ లాక్డౌన్ నిబంధనలు తొలగించినా కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పిన ఈ ట్యూన్.. ఇకపై భారత్ తయారు చేసిన వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తోంది. కాగా.. ఇప్పటి వరకూ కరోనా జాగ్రత్తలన్నీ హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గొంతులో వినిపించేవి. అయితే ఈ కొత్త సూచనలు మాత్రం ఓ మహిళ స్వరంలో వినిపించనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments