కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత..
- IndiaGlitz, [Friday,May 21 2021]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. మందు కోసం జనం పోటెత్తడంతో పంపిణీ చాలా కష్టంగా మారింది. 5 వేల మందికి సరిపడా మందు తయారు చేస్తే 35 వేల మంది పంపిణీ ప్రాంగంణం వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్‌లు కడుతుండటంతో మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తునట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుంచి విశాలమైన గ్రౌండ్‌లో మందు పంపిణీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'
కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఆయుర్వేద మందును తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఇది సత్ఫలితాలనిస్తోందని మందు తీసుకున్న ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి దుష్ఫలితాలూ నమోదవకపోవడంతో ప్రజలు తండోపతండాలుగా కృష్ణపట్నంకు క్యూ కట్టారు. నేడు ఆయుర్వేద మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రారంభించారు. అయితే కొవిడ్ పాజిటివ్ పేషెంట్స్‌కి మాత్రమే అందజేస్తామని ముందుగానే ప్రకటించారు. అయినా కూడా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయి మరీ కరోనా పేషెంట్లు కృష్ణపట్నం చేరుకున్నారు. ఏపీ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చారు. దీంతో కంట్రోల్ చేయడం కష్టమై మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు.
కాగా.. ఆనందయ్య కరోనా మందును పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ఆయుష్ ల్యాబ్‌కు పంపించింది. ఈ ల్యాబ్ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈ మందులు హానికరం కావని తేలింది. అలాగే, ప్రమాణాలకు లోబడి కూడా ఉన్నాయని రిపోర్టులో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకొన్ని రిపోర్టులకు రెండు రోజులు పట్టవచ్చు. అప్పటివరకు ప్రభుత్వం ఈ మందుల పంపిణీకి అనుమతి ఇవ్వదు. అయితే, స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం శుక్రవారం నుంచి మందులు పంపిణీ చేస్తామని ప్రకటించడం గమనార్హం. నేడు మందు పంపిణీ విషయమై సీఎం జగన్ అధికారులతో చర్చించిన మీదట అధికారిక పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు.