Coromandel:రూ.1000కోట్లతో కాకినాడలో కోరమాండల్ ప్రాజెక్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎరువుల తయారీలో పేరొందిన కోరమాండల్ కంపెనీ కాకినాడ సమీపంలో దాదాపు రూ.1000 కోట్లతో ఫాస్ఫరిక్ యాసిడ్-సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఇప్పటికే శంకుస్థాపన కూడా జరిగిపోయింది. రెండేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కాకినాడ వద్ద నిర్మిస్తున్న ఈ ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలోనే రెండవ అతి పెద్దది కావడం విశేషం.
రోజుకు సుమారు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్పరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే విధంగా కంపెనీ రూపుదిద్దుకోనుంది. అదేవిధంగా రోజుకు దాదాపు 1,800 టన్నుల సామర్థ్యం గల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం ఇక్కడ కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికి పైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్పరిక్ యాసిడ్ సరఫరా చేస్తుందని సంస్థ ప్రకటించింది.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెట్టుబడి మద్దతును కోరుతోంది. ఇలా చేయడం వల్ల ఎరువుత తయారీకి కీలక ముడి పదార్థాల సరఫరా భద్రతను నిర్థారిస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం కోరమాండల్‌కు వైజాగ్‌తో పాటు ఎన్నూర్‌లో ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఉన్నాయి. దేశంలో తయారయ్యే NPK(నైట్రోజన్, ఫాస్పరస్, పోటాషియం) ఎరువుల్లో 15 శాతం ఇక్కడే ఉత్పత్తి కానున్నాయి. ఈ సంస్థ ఏర్పాటు వల్ల కాకినాడ చుట్టుపక్కల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout