మురగదాస్ ఇంటికి పోలీసులు
- IndiaGlitz, [Friday,November 09 2018]
తమిళ హీరో విజయ్, ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ సర్కార్. అభిమానుల ఆదరణను అందుకుంటుంది. అయితే తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఈ సినిమాపై మండిపడుతున్నాయి. ఆ పార్టీలు ప్రవేశ పెట్టిన పథకాలను సర్కార్ కించపరిచేలా ఉందని ఆయా పార్టీల వాదన. దీనిపై సదరు పార్టీల వారు పిర్యాదులు కూడా చేశారట.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మురగదాస్ను అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారట. మురగదాస్ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఆయన ఆచూకీ గురించి విచారించి వెళ్లిపోయారట పోలీసులు. ఈ విషయాన్ని దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్, చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.