పవన్, కేటీఆర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకూ వీరిద్దరీ మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ఎందుకు జరిగింది? అనే వివరాల్లోకెళ్తే...కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపడుతున్నాయి. సినీ సెలబ్రిటీలు కూడా ప్రభుత్వాలకు తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా పలువురు ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలను అందించారు.
పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే ప్రధాని సహాయనిధికి కోటి రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ గొప్ప మార్క్ చూపించావని మెసేజ్ చేయగా థాంక్యూసార్ అని పవన్ రిప్లై ఇచ్చాడు పవన్. దానికి కేటీర్ స్పందిస్తూ అన్నా మీరు నన్ను ఎప్పటి నుండి సర్ అని పిస్తున్నారో తెలియడం లేదు. ఎప్పటికీ తమ్ముడూ అనే సంబోధించండి అన్నాడు. దానికి పవన్ స్పందిస్తూ అలాగే తమ్ముడు అన్నారు. ఇలా వీరి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments