Nara Lokesh:ఫ్రస్ట్రేషనా, ఆక్రోశమా : ఏంటిది లోకేషా.. తేడా వస్తే బలయ్యేది కార్యకర్తలే
Send us your feedback to audioarticles@vaarta.com
యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లో నానాటికీ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తన యాత్రకు జనం రావడం లేదని ఆక్రోశమో, లేక పబ్లిక్‌ను అటెన్షన్‌లో వుంచాలన్న తాపత్రయమో తెలియదు కానీ నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నాడు. పుంగనూరులో తండ్రి చంద్రబాబు నాయుడు చేసిన రచ్చతో స్పూర్తి పొందాడో ఏమో కానీ కేడర్‌ను రెచ్చగొట్టేలా మాట్లడుతున్నాడు లోకేష్. వైసీపీ నాయకులతో గొడవపడండి, మీపై ఎన్ని కేసులు వుంటే అంత ప్రాధాన్యం ఇస్తానంటూ లోకేష్ దగ్గరుండి కేడర్‌ను విధ్వంసానికి ఉసిగొల్పుతున్నాడు. ఆయన వైఖరి శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తుంది. ఇది సమాజంలో హింసకు దారి తీస్తే దీనికి బాధ్యులు ఎవరు అన్నది తెలుగుదేశం భావి సారథి విజ్ఞతకే వదిలేయాలి.
చంద్రబాబు కనుసన్నల్లో పుంగనూరు విధ్వంసం:
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పుంగనూరులో జరిగిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోలీసులను కొట్టండి, తరమండి అంటూ బాబు గారు చేసిన ప్రకటనతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు నానా విధ్వంసం సృష్టించారు. పోలీసులను, వైసీపీ కేడర్‌ను దొరికినవాళ్లను దొరికినట్లు చితకబాదారు. ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులు, వైసీపీ నేతలకు గాయాలవ్వగా.. ఓ కానిస్టేబుల్‌కు కంటి చూపు పోయింది. ముందుగా ఇచ్చిన రూట్ కాకుండా పుంగనూరు పట్టణంలోకి ఎలాగైనా చొచ్చుకుని వెళ్లాలన్న చంద్రబాబు ప్లాన్ ఇంతటి హింసకు దారి తీసింది.
వైసీపీపై బురద జల్లాలని అడ్డంగా బుక్కయిన టీడీపీ:
ఇది అధికార పార్టీ కుట్రేనంటూ టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లి.. లబ్ధిపొందాలని చూసింది. కానీ అబద్ధాన్ని ఎక్కువరోజులు దాచలేరుగా. ఈ ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న టీడీపీ నేత చల్లా బాబు డ్రైవర్ పోలీసులకు జరిగిన కుట్రను పూసగుచ్చినట్లుగా వివరించాడు. కుట్ర, అమలు అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలను తెలియజేశాడు. ఈ స్కెచ్ చూసి పోలీస్ అధికారులు సైతం ఖంగుతిన్నారు. దాడికి కుట్ర చేసిన వాళ్లు, అమలు చేసినవాళ్లు హాయిగానే వున్నారు. కానీ పుంగనూరులో పోలీసుల మీద దాడులకు తెగబడిన వందలాదిమంది టీడీపీ నాయకులమీద కేసులు బుక్కవ్వగా ఇప్పుడు వారంతా బెయిల్ కోసం తిరుగుతూ అజ్ఞాతంలో బతుకుతున్నారు. ఇటు వారి భార్యాబిడ్డలు ఆందోళనలో తిండి, నిద్ర లేకుండా రోదిస్తున్నారు. నాయకుల కారణంగా అంతిమంగా బలయ్యేది కార్యకర్తలే అన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి.
విజన్ చెప్పమంటే.. పొడిచేస్తాం, నరికేస్తామంటారా :
పుంగనూరు ఘటన నుంచి తేరుకోకముందే నారా లోకేష్ గన్నవరంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒకొక్కడికి ఉచ్చ పోయిస్తాం... కొందర్ని చంపేద్దాం.. ఇంకొందరిని చెడ్డీలతో నడిపిద్దాం అని ఒక నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడాడు. పాదయాత్ర మొదలైన కొత్తలో ఒద్దికగా వున్న లోకేష్ రాను రాను తన నిజ స్వరూపం బయటపెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంత మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, రోడ్లు వేస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పాలి. అలా కాకుండా వైసీపీపైనా, సీఎం వైఎస్ జగన్‌పై అక్కసు వెళ్లగక్కడం కరెక్ట్ కాదంటున్నారు. పార్టీకి భావి నాయకుడిగా కోట్లాది మంది కార్యకర్తలు భావిస్తున్న వ్యక్తి వుండాల్సింది ఇలా కాదని అంటున్నారు. నాయకుడు అనేవారు అభిమానంతో, తమ పనితీరుతో ప్రజల మనసును గెలుచుకోవాలి తప్పించి.. భయపెట్టి, హీరోయిజం చూపించాలనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout